Sunday, December 22, 2024

డ్రోన్ కెమెరాను పాడుబడ్డ భవనంలోకి పంపించి… విడాకులు తీసుకున్నాడు

- Advertisement -
- Advertisement -

జియాన్: ప్రతి సమస్యను టెక్నాలజీతోనే పరిష్కరిస్తున్నారు. మంచికి చెడుకు టెక్నాలజీతోనే పరిస్కరిస్తున్నారు. నేరాల నుంచి మొదలు పెడితే మోసాల వరకు.. అన్నీ టెక్నాలజీతో నిందితులను గుర్తిస్తున్నారు. ఓ మహిళ తన భర్తను నిర్లక్ష్యం చేయడంతో ఆమెపై అతడికి అనుమానం కలిగింది. తన భార్య చేస్తున్న బండారాన్ని బయటపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. పాడుబడ్డ ఇంట్లోకి డ్రోన్ కెమెరాన్ని పంపించి తన భార్య బాగోతాన్ని బయటపెట్టిన సంఘటన చైనాలోని సెంట్రల్ హుజీ ప్రావిన్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జియాన్‌లో 33 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

భార్యకు ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి అతడిని ఆమె పట్టించుకోకపోవడంతో భర్తకు అనుమానం కలిగింది. నెలలో రెండు మూడు స్లారు పుట్టింటికి అని వెళ్తుండడంతో అతడికి మరింత అనుమానం బలపడింది. గత వారం తన పుట్టింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పి భార్య బయలుదేరింది. ఆమెను అనుకరిస్తూ వెళ్లాడు. ఆమె కొంచెం దూరం వెళ్లిన తరువాత పాడుబడ్డ భవనంలోకి వెళ్లింది. భర్త తన దగ్గర ఉన్న డ్రోన్ కెమెరాను పాడుబడ్డ భవనంలోకి పంపించాడు. భార్య, ఆమె బాస్‌తో కలిసి చేస్తున్న రాసలీలలు డ్రోన్ కెమెరాతో వీడియో తీసి రికార్డు చేశాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని వీడియోలతో సహా కోర్టు మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త తెలివికి హ్యాట్సాప్ అంటూ కొందరు కామెంట్లు చేశారు. భార్య చేసిన మోసాన్ని టెక్నాలజీతో బయటపెట్టాడని భర్తను నెటిజన్లు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News