Thursday, May 15, 2025

పవన్ చాలా జాగ్రత్తగా ఉండాలి… కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక!

- Advertisement -
- Advertisement -

ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు వెల్లడించాయి. పవన్ కల్యాణ్ తన భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో, పవన్ కల్యాణ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఉండడం, ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి మద్దతుదారు కావడంతో, ఆయనను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News