Friday, December 20, 2024

రాష్ట్రానికి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

central intelligence warning to telangana

రాష్ట్రంలో ‘పంద్రాగస్టు’ అలర్ట్
‘ఉగ్ర’ సంబంధాలపై ప్రత్యేక దృష్టి
స్లీపర్‌సెల్, మాడ్యువల్స్ కదలికలపై నజర్
అజ్ఞాతంలో ఉన్నవారి కోసం ఎన్‌ఐఏ ఆరా..!

హైదరాబాద్:  ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రకుట్రలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాల ముందస్తు హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, పోలీసులు ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఐఎస్‌ఐఎస్, ఉగ్రభావజాలంపట్ల ఆకర్షితులైన వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఆధారాలు సేకరించిన అనంతరం సదరు యువకులను అదుపులోకి తీసుకోవాలని అటు ఎన్‌ఐఎ,ఇటు ప్రత్యేక పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐసిస్ సిద్ధాంతాన్ని హైదరాబాద్ నగరంలో విస్తరించేందుకు గతంలో కీలక పాత్ర పోషించిన మాడ్యుల్స్, స్లీపర్ సెల్‌పై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. నగరంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన యువతను ఐసిస్ పట్ల ప్రభావితం చేసేందుకు సామాజిక మాధ్యమాల ఆయుధంగా చేసుకున్నట్లుగా ఎన్‌ఐఎ అధికారులు అనుమానిస్తున్నారు.

ఉగ్రవాద భావాజాలాలనికి అకర్షితులవుతున్నారనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఉగ్రప్రభావిత ప్రాంతాలలో రహస్యంగా విచారణ చేపడుతున్నారు. ఇటీవల నిజామాబాద్‌లో ఉగ్రలింకులపై ఎన్‌ఐఎ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఖాతాలో అనుమానిత నగదు లావాదేవీలు జరిగిన నేపథ్యంలో నిందితులను ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుంది. అదేవిధంగా బిజెపి బహిషృత నేత నుపూర్‌శర్మ వాఖ్యలతో జరిగిన హత్యలకు సంబంధించిన నిందితుల కోసం హైదరాబాద్ నగరంలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించించిన విషయం తెలిసిందే. అనంతరం అనుమానిత యువకులను బేగంపేటలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. ఉగ్రవాద భావాజాలం పట్ల ఆసక్తి చూపుతూ సంబంధిత వ్యక్తులతో సంభాషణలు సాగిస్తున్నారన్న పక్కా ఆధారాలతో ఎన్‌ఐఎ ధికారులు విచారిస్తున్నారన్నది సమాచారం.ఉగ్ర కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా షాయిన్‌నగర్, పహడి షరీఫ్, అభిన్‌పురాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అదృశ్యమైన వారి ఆచూకీ కోసం 
నగరంలోని స్లీపర్ సెల్, మాడ్యువల్స్ కదలికలపై నిఘా సారిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఐసిస్ పట్ల ఆకర్షితులైన వారి జాబితాను పరిశీలిస్తున్నారు. కాగా పాతబస్తీలో కొందరు యువకులు కనిపించకుండా పోయారని, అయితే వారిపై పోలీసు స్టేషన్లలో ఏలాంటి కేసులు నమోదు కాలేదు. ఈక్రమంలో అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను సేకరిస్తున్నారు. వీరు ఎక్కడు ఉన్నారు? ఉగ్రవాదం పట్ల ఆకర్షితులై ఆయా సంస్థల్లో పనిచేస్తున్నారా? అన్న కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు సాగిస్తోంది. గతంలో సిమిలో పనిచేసిన వారు ఇతర ఉగ్రవాద సంస్థలలో కీలకంగా పనిచేస్తున్నారని ఎన్‌ఐఏ అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉగ్రవాద సాహిత్యాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నగరంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలకు ఉగ్రవాద కార్యకలాపాల వైపుగా మళ్లీంచేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించినట్లు సమాచారం. పాతబస్తీలోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని ఉగ్రవాదం వైపు మళ్లీంచేందుకు ఐసిస్ పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఎన్‌ఐఎ భావిస్తోంది.

దుబాయ్, జిద్దాలతో పాటు కొన్ని అరబ్ దేశాలలో పనిచేస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారు ఐసిస్‌ను బలోపేతం చేయాలన్న సంకల్పంతో కుట్రపన్నుతున్నారని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈక్రమంలో కేంద్ర నిఘా వర్గాల ఆదేశాల మేరకు ఎన్‌ఐఎ అధికారులు ఉగ్ర ప్రభావిత రాష్ట్రాలలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలియవచ్చింది. ్రఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఐసిస్ పట్ల అకర్షితులౌతున్న యువతను నియంత్రించేందుకు ఎన్‌ఐఏ తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. నిరుపేదలు ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఐసిస్ సానుభూతి పరులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఎన్‌ఐఏ అభిప్రాయ పడుతోంది. నెల 15 స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకలలో ఉగ్ర కుట్ర జరిగే అవకాశం ఉందన్న అనుమానంలో భాగంగా దేశంలోని కేరళ, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎన్‌ఐఎ అధికారులు వివరిస్తున్నారు, నగరంలో ఐసిస్ కార్యకలాపాలు రహస్యంగా జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ సైతం తనదైన శైలిలో దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News