Monday, December 23, 2024

రాకేశ్ టికైత్‌ని ‘దో కౌడీకా ఆద్మీ’ అన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

- Advertisement -
- Advertisement -

Ajay Mishra comment
లఖీంపుర్ ఖీరీ: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టేనీ, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ ‘ఎందుకూ పనికిరాని వ్యక్తి’( దో కౌడీ కా ఆద్మీ) అని వ్యాఖ్యానించారు. టికైత్ రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ రెండుసార్లు ఆయన డిపాజిట్ జప్తయిపోయిందన్నారు. “అలాంటి దో కౌడీ(విలువలేని) వారికి జవాబు ఇవ్వదలచుకోలేదు” అన్నారు. ఇప్పుడు ఆయన ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ముందు ఆయన లఖీంపుర్ ఖీరీలో నడుస్తున్న వాహనంతో రైతులను చంపివేయడంలో వివాదంలో పడ్డారు. ఆ తర్వాత ఓ విలేకరిని బెదిరిస్తూ కెమెరాకు కూడా చిక్కారు. ఇప్పుడు రాకేశ్ టికైత్‌ను తక్కువచేసి మాట్లాడుతూ వివాదంలో చిక్కుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News