Friday, October 18, 2024

కులగణనపై కేంద్ర మంత్రి పాసవాన్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కులగణనపై కేంద్ర మంత్రి లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్‌పాసవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కులగణన చేపట్టేందుకు మద్దతు తెలిపారు. కానీ అది సమాజ విభజనకు దారి తీస్తుందన్నారు. అందుకే వాటి సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని హెచ్చరించారు.

“ కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి పథకాలకు నిధుల కేటాయింపు కోసం నిర్దిష్ట డేటా తరచూ అవసరమవుతోంది. న్యాయపరమైన సమస్సయలను పరిష్కరించడం లోనూ ఈ డేటా ఉపయోగపడుతుంది. కులగణన నిర్వహించడం అవసరమే. కానీ ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. కులగణన ద్వారా సమాజంలో విభజన ఏర్పడే అవకాశం లేకపోలేదు . కాబట్టి ఈ గణాంకాలను బయటకు తీసుకురావడం అంత మంచిది కాదు. ఎన్డీయే ప్రభుత్వంలో దీనిపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు” అని విలేకరుల సమావేశంలో చిరాగ్ వ్యాఖ్యలు చేశారు.

“భిన్నత్వంలో ఏకత్వాన్ని భారత్‌లో చూడవచ్చు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో కనుక చూస్తే కొందరు ఆదివాసీలు వీటికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురాగలమా? కులగణనకు ముందు ఒక ముసాయిదా తీసుకురావాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అది వచ్చేంతవరకు నేనేమీ మాట్లాడలేను” అని పేర్కొన్నారు. దేశంలో కులగణన చేపట్టాలని ప్రతిపక్షాలు కేంద్రాన్నిడిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యం లోనే కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News