Monday, December 23, 2024

11 మంది ఇంటర్ పాస్..57 మంది పట్టభద్రులు

- Advertisement -
- Advertisement -

71 మంది కేంద్ర మంత్రుల విద్యార్హతలు

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన 71 మంది మంత్రులలో 11 మంది తమ విద్యార్హత 12వ తరగతిగా ప్రకటించగా 57 మంది డిగ్రీ లేదా అంతకుమించి చదువకున్నట్లు వెల్లడించారు. భారతీయ మంత్రుల విద్యార్హతలను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) తన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 71 మంది మంత్రులలో 15 శాతం మంది అంటే 11 మంది తమ అత్యున్నత విద్యార్హత 12వ తరగతిగా ప్రకటించినట్లు ఎడిఆర్ తెలిపింది.

అయితే మంత్రులలో అధిక శాతం మంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండడం విశేషం. మంత్రులలో 80 శాతం మంది అంటే 57 మంది డిగ్రీ, అంతకుమించి విద్యార్హతలు కలిగి ఉన్నట్లు ఎడిఆర్ తెలిపింది. వీరిలో 14 మంది గ్రాడ్యుయేట్లు(యూనివర్సిటీ మౌలిక డిగ్రీ) కాగా మరో 10 మంది న్యాయ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉన్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిన మంత్రులు 26 మంది ఉండడం గమనార్హం. అంతకుమించి ఏడుగురు మంత్రులకు డాక్టరేట్ డిగ్రీలు ఉండడం విశేషమనే చెప్పాలి. వీరుగాక ముగ్గురు మంత్రులు వొకేషనల్, టెక్నికల్ ట్రెయినింగ్ వంటి డిప్లొమా పర్టిఫికెట్లు కలిగి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News