మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేడు నిర్వహించే సెంట్రల్ ఆర్డ్ పోలీసు ఫోర్స్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో 8న సెంట్రల్ ఆర్డ్ పోలీసు ఫోర్స్ కేంద్రాల్లో 9039 మంది అభ్యర్దులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. ఈపరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్దులు డౌన్‌లోడ్ చేసుకున్న ఈ అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తమ ఎంత తీసుకురావాలన్నారు. ఈపరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు, శానిటైజర్, బౌతికదూరం పాటించాలని తెలిపారు. మాస్కులు లేని అభ్యర్దులను పరీక్షకు అనుమతించారని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహకులు, అభ్యర్దులు తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వారు సూచించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేస్తూ, మొబైల్ ఫోన్లు టాబ్లెట్స్, వాచీలు, క్యాలీకులేటర్లు, వ్యాలెట్స్, ఇతర రికార్డింగ్ పరికరాలు మొదలైనవి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరిగిందన్నారు. హాల్ టిక్కెట్లలో సూచించిన పరీక్ష కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద రెవెన్యూ సూపరవైజర్లు పాటు లోకల్ ఇన్సెఫెక్షన్ ఆపీసర్లు ఉంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో యుపిఎస్సీ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ భగవాన్‌దాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సెంట్రల్ ఆర్డ్ పోలీసు ఫోర్స్ పరీక్ష సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -