Saturday, November 23, 2024

జీనోమ్ వ్యాలీలో ఎన్‌సిడిసి ల్యాబ్

- Advertisement -
- Advertisement -

జీనోమ్ వ్యాలీలో ఎన్‌సిడిసి ల్యాబ్!
సూత్రపాయంగా నిర్ణయించిన సెంట్రల్ టీం
తాత్కాలిక ప్రయోగాలకు నల్లకుంటలోని పాత భవనం ఎంపిక

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎట్టకేలకు ఎన్‌సిడిసి(నేషనల్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బ్రాంచ్) ల్యాబ్ ఏర్పాటుకు సెంట్రల్ టీం అంగీకరించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన తుర్కపల్లి (జీనోమ్ వ్యాలీ)లో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని డా కె ఎల్ రమేష్ బృందం సూత్రపాయంగా నిర్ణయించింది. వాస్తవంగా ఇక్కడ ‘నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్’సంస్థ ఉంది. ఇది ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)కు అనుబంధంలో ఉంది. అయితే దీని పక్కన ఎన్‌సిడిసి ల్యాబ్‌కు కావాల్సిన జాగ అనుకూలంగా ఉండటంతో ఇక్కడే ఏర్పాటు చేయడం బెటర్ అని కేంద్ర బృందం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే అక్కడి మౌళికవసతులు, సౌకర్యాలు, వాతావరణ పరిస్థితులు వంటి వివరాలను సెంట్రల్ టీం నివేదిక రూపంలో తయారు చేసింది. అనంతరం బిఆర్‌కే భవనంలో గురువారం హెల్త్ సెక్రటరీ, ఇతర వైద్యాధికారులతో సెంట్రల్ టీం భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాగానే ల్యాబ్ నిర్మాణ పనులు షురూ అవుతాయని డా రమేష్ బృందం తెలిపింది. అయితే అప్పటి వరకు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వెనకవైపు ఉన్న కుష్టు వ్యాధి నిర్మూలన శిక్షణ కేంద్రం పాత భవనాన్ని వినియోగిస్తామని కేంద్రం చెప్పింది. దీనికి రాష్ట్ర అధికారులూ అంగీకరించారు.

Central team agree to make NCDC Lab in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News