Wednesday, September 18, 2024

చలించిన కేంద్ర బృందం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం/ మహ బూబాబాద్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భా రీ వర్షాలు వరదల కారణంగా వివిధ రంగాలకు కలిగిన విపత్తు నష్టాలను క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా చూసిన కేంద్ర ప్రభుత్వ బృందం చలించిపోయింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యం గా ఖమ్మం జిల్లాలోని వరదప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి. మొత్తం ఆరుగు సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి, ఖమ్మం జిల్లాలోని కూసుమం చి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మం డలాల్లో తొలిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి బా ధితులు, రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్న ల్ కీర్తి ప్రతాప్ సింగ్, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్ కుమార్, వ్యవసాయశాఖ నుంచి శాంతినాథ్ శివప్ప ఒక బృందంగా పర్యటించా రు. రెండో బృందంలో రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ కే కుశ్వంగ, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి టి నైల్ ఖాన్సూన్, ఎన్‌ఆర్‌ఎస్‌సీ నుంచి శశివర్ధన్ రెడ్డి మరో బృం దంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.

తొలుత కూ సుమంచి మండలం భగత్ వీడుకు చేరుకున్నా రు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కోతకు గురైన పొలాలు, ఇసుక మేటలు వేసిన పొలాల ను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు పంట నష్టంపై తమకు జరిగిన నష్టాన్ని కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. జాతీయ రహదారిపైనే పాలేరు నియోజకవర్గం లో జరిగిన వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వ్యవసాయ ఉద్యాన అధికారులు నష్టం వివరాలను కేంద్ర బృందానికి విన్నవించారు. రెండో బృందం మల్లాయిగూడెం పంచాయతీలో వరదల ధాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్ రహదారిని పరిశీలించింది. పాలేరు జలాశయం వద్ద గండి పడిన సాగర్ ఎడ మ కాల్వను పరిశీలించారు. జలవనరుల శాఖ సీఈ విద్యాసాగర్ జిల్లాలో సాగునీటి రంగానికి జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి వివరించారు. తర్వాత ఎర్రగడ్డ తండాకుచేరుకుని భారీ వర్షాలకు నీట మునిగిగిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పంపౌ హౌజ్‌ను పరిశీలించారు. నీట ము నిగిన మోటార్లు, ప్యానెల్ బోర్డులను పరిశీలించారు.

కూసుమంచి మండల పర్యటన తర్వాత ఖమ్మం గ్రామీణంంలోని గూడూరుపాడు తనకంపాడు గ్రామాల పరిధిలో ఆకేరు వరదకు కొట్టుకుపోయిన పంట పొలాలు, కోతకు గురై భారీగా ఇసుక మేటలు వేసిన వ్యవసాయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నష్టపోయిన పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు గ్రామాల రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులను ఏయే పంటలు సాగు చేస్తున్నారని వివరాలు అడిగారు. పంటలసాకుగు ఎంత ఖర్చయింది? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు, భారీ వర్షాలు వరదలు మిగిల్చిన నష్టాలపై వివరించి తమ గోడువెళ్లబోసుకున్నారు. అనంతరం పంట నష్టానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను కేంద్రం బృందం తిలకించింది. కస్నా తండాలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న, నీట మునిగిన ఇళ్లను కేంద్ర బృందం పరిశీలించింది. బాధితులతో మాట్లాడి వరద మిగిల్చిన నష్టాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో పర్యటించారు.

తండాలో ఇళ్లను పరిశీలించారు. తండా వాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు,వరద బాధితులు మనోధైర్యం కోల్పోవద్దంటూ కేంద్రం బృందం సభ్యులు భరోసా ఇచ్చారు. కేంద్ర బృందాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, గనుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా గురువారం ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News