Wednesday, January 22, 2025

రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షా లు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనుంది. ఈ నెల 11న కల్నల్ కీర్తీప్రతాప్‌సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా, వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనుంది.

ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడి, ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News