Sunday, December 22, 2024

వరద ప్రభావిత ప్రాంతాలకు నేడు కేంద్ర బృందం

- Advertisement -
- Advertisement -

కునాల్ సత్యార్ధి నాయకత్వంలో వరద నష్టం అంచనా వేయనున్న బృందం

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటి మునిగి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులు వెళ్లి భరోసా కల్పిస్తున్నారు. వరద నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందాన్ని తెలంగాణలో పర్యటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు.

ఈ అధికారుల బృందంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉండనున్నారు. ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు కునాల్ సత్యార్ధి నాయకత్వం వహించనున్నారు. కేంద్ర అధికారుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనావేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా జతపరుస్తూ కేంద్ర అధికారుల బృందం నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

flood areas in Telangana

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News