మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: భారీ వర్షాలు, వరద విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ఆ రోజు జరిగిన విలయం కళ్ళకు కట్టినట్లు అర్థం అ వుతుందని, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు కేంద్ర బృందానికి నాయక త్వం వహించిన కల్నల్ కే.పి. సింగ్ తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందం రెండో రోజు గురువారం జిల్లాలో పర్యటించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కెపి. సింగ్ నేతృ త్వంలో మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కె. కుష్వాహ, టి. నియాల్ కన్సన్, డా. శ్రీ శశివర్ధన్ రెడ్డి లతో కూడిన కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది. మొదటి బృం దం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహ కల్ప, ఖమ్మం నగరంలోని కాల్వఒడ్డు బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి, మోతీనగర్ ప్రాంతాల్లో, రెండో బృందం ఖమ్మం రూరల్ మండలం దానవాయి గూడెం, తల్లంపాడు-తెల్దారుపల్లి,
తనగంపాడు, ఖ మ్మం నగరంలోని ప్రకాష్ నగర్‌లలో పర్యటించి, భా రీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. ముంపు ప్రాంతాల్లో తిరు గుతూ, మున్నేరు ఉధృతిని, ప్రవాహం ఏ మేరకు వ చ్చింది. ప్రవాహం ఎంత సమయం మేర నిలిచింది, నష్ట వివరాలను ఫోటో ఎక్జిబిషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వివరించారు. ప్రకాశ్ నగర్ లోని మున్నేరుబ్రిడ్జిని కూడా పరిశీలిం చారు.దెబ్బతిన్న ఇండ్లు, సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలిన కుటుంబాలను కేంద్ర బృందం కలిసి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మోతినగర్ లో పలువురు వరద బాదిత కుటుంబాలు తమకు జరిగిన నష్టాన్ని వివరించి కన్నీ టి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం న గరపాలక సంస్థ కమీషనర్ అఖిలేష్ అగస్త్య, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఆర్డీవోలు జి. గణేష్, రాజేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.