Monday, December 23, 2024

వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన

- Advertisement -
- Advertisement -

ములుగు: అంతర్ మంత్రిత్వశాఖ కేంద్ర బృందం ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి ఆధ్వర్యంలో కేంద్రం బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటన ముగించుకుని ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి బుధవారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 9 మండలాలలో జులై 18 నుండి 28 వరకు 776.3 ఎంఎం వర్షం కురిసిందని వివరించారు. జులై 27న ఒకే రోజు కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున జంపన్న వాగు వరదలు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. జిల్లాలో వరి 3135 ఎకరాలు, పత్తి 3020, మిర్చి 124, హార్టికల్చర్ క్రాప్స్ 38, సాండ్ కాస్టింగ్ 1450 ఎకరాలు మొత్తం 7766 ఎకరాల పంట నష్టం జరిగిందని అన్నారు. వరదల వల్ల 54 గ్రామాలు, 27 లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని వారికి వివరించారు.

వరదల వల్ల 17 మంది మానవ నష్టం జరిగిందని అన్నారు. 624 జంతువులు చనిపోయాయని తెలిపారు. 10 చెరువులు దెబ్బతిన్నవని, కెనాల్స్ 32 దొడ్ల బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు. పీఆర్ రోడ్లు 48, 100.5 కి.మీ, ఆర్‌అండ్‌బి రోడ్లు 31, 24.05 కిలోమీటర్లు, టిడబ్య్లూ ఈ రోడ్లు 17,7.12 కిలోమీటర్లు మొత్తం 96 రోడ్లు, 131.22 కిలోమీటర్లు రోడ్డు దెబ్బతిన్నాయని వివరించారు. 33కెవి 94, 11 కెవి 373, ఎల్టీ 621, డిటిఆర్ 172 విద్యుత్ పోల్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. మత్స సంపద నష్టం గిల్ నెట్స్ 1829 కేజీలు, చేపల చెరువులు 21.0 హ దెబ్బతిన్నాయని, 2300 టన్నుల చేపలు కోల్పోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 5861 మందికి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ రెస్యూ టీములు పని చేశాయని అన్నారు. ప్రయివేట్ బోట్లు స్విమ్మర్‌లను అన్ని మండలాలో ఏర్పాటు చేశామని అన్నారు.

జిల్లాలో అంచనాలకు మించి వర్షం కురిసిందని అన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేశారని తెలిపారు. అనంతరం గోవిందరావు పేట మండలం పస్రా గుండ్లవాగు వద్ద ద్వసం అయిన జాతీయ రహదారిని, తాడ్వాయి మండలం జలగలంచ కల్వర్ట్ వద్ద ద్వంసం అయిన జాతీయ రహదారిని కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూనుస్వామి, హైదరాబాద్ ఎన్‌ఆర్ ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే, జిల్లా ఎస్పీ గాష్ ఆలం, డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News