Monday, December 23, 2024

ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫామ్‌లో సెంట్రల్ వర్సిటీ లెక్చరర్లు: కర్నాటకలో రచ్చ

- Advertisement -
- Advertisement -

కాలబురగి(కర్నాటక): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) యూనిఫారం ధరించి ముగ్గురు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక లెక్చరర్లు తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కర్నాటకలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అలంద్ తాలూకాలోని కడగంచి గ్రామంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఈ ముగ్గురు లెక్చరర్లు ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫారం ధరించి, చేతిలో లాఠీలతో ఒక విద్యార్థితో కలసి ఫోటోకు పోజిచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలుగా లెక్చరర్లు కనిపించడంపై నెటిజన్లు అభ్యంతరం తెలియచేస్తున్నారు. ఫోటోలో ఉన్న లెక్చరర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అలోక్‌కుమార్ గౌరవ్, సైకాలజీ లెక్చరర్ విజయేంద్ర పాండే, బయో సైన్స్ లెక్యరర్ రాకేష్ కుమార్‌గా గుర్తించారు. క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ పథ్‌సంచాలన్ కార్యక్రమం సందర్భంగా ఈముగ్గురు లెక్చరర్లు ఇలా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలుగా దర్శనమిచ్చారని వర్గాలు తెలిపాయి.

ఈ ఫోటోపై యూనివర్సిటీ సిబ్బంది కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏ సంస్థతో సంబంధం పెట్టుకోరాదని, విద్య, పరిశోధనకు తప్ప మరే ఇతర కార్యకలాపాలలో పాలుపంచుకోరాదని సిబ్బంది చెబుతున్నారు. అయితే యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ సంఘటన తమ దృషికి రాలేదని చెబుతున్నారు. యూనివర్సిటీ లెక్చరర్లు చదువుకు సంబంధించి తప్ప మరే ఇర కార్యకలాపాలలో పాల్గొనకూడదని వారు స్పష్టం చేశారు. ఈ సంఘటనలోని నిజానిజాలు తెలుసుకుంటామని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News