Monday, January 20, 2025

ఉద్యోగులకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచింది. ఇపిఎఫ్‌ఒ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ట్రస్టీస్ సిఫారసులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఇపిఎఫ్‌ఒ మార్చిలో వడ్డీ రేట్లను 0.05 శాతం పెంచాలని సిఫార్సు చేసింది. ఇపిఎఫ్‌ఒ జూలై 24న ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలోని 6 కోట్ల మందికి పైగా ఉద్యోగులు పీఎఫ్ పరిధిలోకి వస్తారు. అంతకుముందు పిఎఫ్ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.10 శాతంగా ఉంది. పీఎఫ్‌లో వడ్డీ రేటును నిర్ణయించడానికి ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ మొదటి సమావేశం నిర్వహిస్తాయి. దీని తర్వాత సిబిటి సమావేశమై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి తీసుకుంటారు. ఆ తర్వాత వడ్డీ రేటు అమలు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News