Thursday, November 14, 2024

నాదెళ్ల, పిచాయ్‌కు పద్మభూషణ్

- Advertisement -
- Advertisement -

Centre announces Padma Bhushan to Sundar Pichai

 భారత్ బయోటెక్ కృష్ణ ఎల్ల, సుచిత్రా ఎల్ల, టాటా చైర్మన్ చంద్రశేఖరన్, సీరం ఎండి పూనావాలాకు కూడా..
 వాణిజ్య విభాగంలో ఐదుగురికి పద్మభూషణ్, నలుగురికి పద్మశ్రీ

ముంబై: ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డుల్లో ఫార్మా, ఐటి దిగ్గజాలు ఉన్నారు. వాణిజ్య విభాగంలో ఐదుగురికి పద్మభూషణ్, నలుగురికి పద్మశ్రీ దక్కింది. ఈ ఏడాదికి గాను కేంద్రం ప్రకటించిన 17 పద్మ భూషణ్ అవార్డుల్లో మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ఉన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, జాయింట్ ఎండి సుచిత్రా ఎల్లను కూడా పద్మ భూషణ్‌తో సత్కరించారు. టాటా సన్స్ అధినేత ఎన్.చంద్రశేఖరన్‌కు కూడా పద్మభూషణ్ దక్కింది. ఇంకా వాణిజ్య విభాగంలో నలుగురికి పద్మశ్రీ లభించింది. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ మూడో అతిపెద్ద పౌర సత్కారంగా గుర్తిస్తారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహి త్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు వంటి వివిధ రంగాల్లో విశేష సేవలకు గుర్తింపుగా ఈ పద్మ అవార్డులతో సత్కరిస్తా రు.

వాణిజ్యం, పరిశ్రమ విభాగంలో విశేష సేవలందించినందుకు గాను భారత సంతతికి చెందిన నాదెళ్ల(54), పిచాయ్(49)లకు ఈ అవార్డులు దక్కాయి. తెలంగాణకు చెందిన భారత్ బయోటెక్‌కు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్రా ఎల్లకు కూడా అత్యున్నత పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఇంకా వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావాలా కూడా పద్మభూషణ్ దక్కింది. ఈ రెండు ఫార్మా సంస్థలు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వంటి కరోనా వ్యాక్సీన్‌లను తయారు చేశాయి. దీని ద్వారా కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో దేశానికి ప్రోత్సాహం అందించాయి. టాటా గ్రూప్ అధినేత నటరాజన్ చంద్రశేఖరన్‌కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఆయన ఐటి దిగ్గజ సంస్థ టిసిఎస్ సిఇఒగా చేసిన తర్వాత టాటా సన్స్‌కు చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఇంకా వాణిజ్యం, పరిశ్రమ విభాగంలో రూపా చైర్మన్ ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్, చంద్రికా గ్రూప్ చైర్మన్ జగ్జిత్ సింగ్ దర్ది, ముక్తామణి దేవి, ర్యుకో హిరాకు పద్మశ్రీ లభించింది.
పద్మభూషణ్ :
టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్
భారత్ బయోటెక్‌కు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్రా ఎల్ల
మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల
గూగుల్ సిఇఒ సుందరరాజన్ పిచాయ్
సీరం ఇనిస్టిట్యూట్ ఎండి సైరస్ పూనావాలా
పద్మశ్రీ:
రూపా చైర్మన్ ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్
చంద్రికా గ్రూప్ చైర్మన్ జగ్జిత్ సింగ్ దర్ది
పారిశ్రామికవేత్త ముక్తామణి దేవి
జపాన్ వ్యాపారవేత్త ర్యుకో హిరా

Centre announces Padma Bhushan to Sundar Pichai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News