Friday, December 20, 2024

కృష్ణా బేసిన్‌లో ఆరు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి

- Advertisement -
- Advertisement -

Centre Approves 6 Projects in Krishna River

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా రివర్‌బేసిన్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆరు ప్రాజెక్టులకు అనుమతిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ ప్రాజెక్టులను తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా నదివెంట ఉన్న ఈ ప్రాజెక్టులకు ఏడాదిలోపు అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్ధనల మేరకు ఈ ఆరు ప్రాజెక్టులకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని క్లాజ్‌లను సవరించింది.ఈ మేరకు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఉన్న
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఈ పధకం పరిధిలోని పంప్‌హౌస్, అనుబంధ పనులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అదనపు 15టిఎంసీల పనులు, పంప్‌హౌస్,అనుబంధ పనులు ఉన్నాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, ఈ పథకం పరిధిలోని పంప్‌హౌస్, అనుబంధ పనులు ఉన్నాయి. అంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో తెలుగుగంగ ప్రాజెక్టు, ఈ పథకం పరిధిలోని హెడ్‌వర్క్, గాలేరునగరి సుజల స్రవంతి పథకం, ఈ పథకం పరిధిలోని ప్రధాన పనులు, అనుబంధ పనులు ఉన్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి పధకం ఎత్తిపోతల పంప్‌హౌస్, అనుబంధ పనులు ఉన్నాయి. పూల సుబ్బయ్య వెలిగొండ పథకం, ఈ పధకం పరిధిలోని హెడ్‌రెగ్యులేటర్, టన్నెల్, అనుబంధ పనులు, నల్లమల సాగర్ పనులు ఉన్నాయి. ఈ ఆరు పధకాల పనులకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Centre Approves 6 Projects in Krishna River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News