Sunday, April 13, 2025

హైదరాబాద్-అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే

- Advertisement -
- Advertisement -

 పచ్చజెండా ఊపిన కేంద్రం డిపిఆర్
రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని రోడ్లు,
ఉపరితల రవాణాశాఖకు కేంద్ర హోంశాఖ
ఆదేశం ట్రిబుల్ ‘ఆర్’ ఉత్తర భాగానికి అనుమతుల
ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
డిసెంబర్ నుంచి కాజీపేటలో రైల్వే కోచ్‌ల
ఉత్పత్తి ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ
ఆధ్వర్యంలో జరిగిన కీలక భేటీలో నిర్ణయాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోని అంశాల పై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దీనికి సంబంధించి వివిధ శాఖలకు కేంద్ర హోం మంత్రిత్వ వాఖ ఆదేశాలు జా రీచేసింది. గత ఫిబ్రవరి మూడో తేదీన 15 శాఖల అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కీలక సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సందర్భంగా చట్టంలో పొందుపరిచిన అంశాలు, వాటి లో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నవి క్రోడీకరించి కేంద్ర రోడ్లు ఉపరితల రవాణా, ఉక్కు, బొగ్గు గనులు, వ్యవసా యం, పెట్రోలియం, రైల్వే తదితర శాఖ ఉన్నతాధికారుల తో గోవింద్ మోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సమీక్షకు సంబంధించిన

మినిట్స్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు. అమరావతి -హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం తెలిపినట్లు మినట్స్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డిపిఆర్) రూపకల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అదేవిధంగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. తెలంగాణ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల విషయంలో నీతి అయోగ్‌తో చర్చించాలని హోంశాఖ సంబంధిత అధికారులకు సూచించింది. కాజీపేటలో డిసెంబర్ నుంచి రైల్వే కోచ్‌ల ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News