Monday, December 23, 2024

సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు 2023కు ఆమోదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సినిమా పైరసీని అడ్డుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు 2023ను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పార్లమెంటు తదుపరి సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సవరణ బిల్లుపై విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. పైరసీ ఫిల్మ్ కంటెంట్‌ను ఇంటర్‌నెట్‌లో ప్రసారం చేయకుండా ఈ బిల్లు దోహదపడుతుందన్నారు.

ప్రస్తుతం ఉన్న యు, ఎ, యుఎ ప్రేక్షకుల వయసులవారీగా వర్గీకరణ విధానాన్ని మార్చనున్నట్లు ఠాకూర్ తెలిపారు. సెన్సార్ బోర్డు అందించే ‘యు’ సర్టిఫికెట్ ఉన్న సినిమా ప్రదర్శనపై ఎటువంటి ఉండవు. అన్ని వయసులవారు యు సర్టిఫికెట్ సినిమాను వీక్షించవచ్చు. అయితే ‘ఎ’ సర్టిఫికెట్‌ఉన్న సినిమా ప్రదర్శనకు కేవలం పెద్దలను మాత్రమే అనుమతిస్తారు. ‘యుఎ’ సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమాను తల్లిదండ్రుల సమక్షంలో 12ఏళ్లలోపు పిల్లలు కూడా చూసేందుకు అనుమతిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News