Friday, December 27, 2024

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా మృతిచెందినవారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా రూ.50వేలు చెల్లించేందుకు కేంద్రం అనుమతించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) కరోనా బాధిత వారసులకు 50వేల పరిహారం చెల్లించేందుకు ఆమోదించినట్లు కేంద్రం లోక్‌సభకు వెల్లడించింది.

మంగళవారం ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి రాయ్ మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణ జాతీయవిధానం ప్రకారం బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందజేయడంతోపాటు, విపత్తు నిర్వహణ ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే తమవద్ద ఉన్న ఎస్‌డిఆర్‌ఎఫ్ నుంచి సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. ఈ మేరకు లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News