- Advertisement -
దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమాధి ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపునకు కేంద్రం మంగళవారం ఆమోదం తెలిపింది. దీనికోసం రాజ్‌ఘాట్ ఆవరణ లోని రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్‌లో ఒక స్థలాన్ని కేటాయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రణబ్‌పై ప్రధాని మోడీ తమ గౌరవాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.
- Advertisement -