న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేశ్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని పేర్కొనమని ఆయనను కేంద్రం కోరింది. ఆయన వారసుడిని తెలుపాల్సిందిగా న్యాయశాఖ మంత్రి శుక్రవారం ఆయనకు రాశారు. ఇదివరకటి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆగస్టు 26న రిటైర్ కావడంతో లలిత్ ఆ పదవిలోకి వచ్చారు. అప్పట్లో న్యాయమూర్తి రమణయే న్యాయమూర్తి లలిత్ పేరును సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదించారు. న్యాయమూర్తి లలిత్ నవంబర్ 8న రిటైర్ కాబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తి తాను దిగిపోయే లోపల సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని సిఫారసు చేయాల్సి ఉంటుంది. న్యాయమూర్తి డివై చంద్రచూడ్ 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియుక్తులు కావొచ్చని భావిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి లలిత్ సుప్రీంకోర్టు జడ్జీ కాకముందు ప్రముఖ సీనియర్ అడ్వొకేట్‌గా పనిచేశారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జీగా 2014 ఆగస్టు 13 నియుక్తులయ్యారు. న్యాయమూర్తి లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జన్మించారు. ఆయన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనానికి అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అయ్యారు. 1983లో ఆయన అడ్వొకేట్‌గా నమోదు చేసుకుని 1983 నుంచి 1985 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆయన సుప్రీంకోర్టు 49వ న్యాయమూర్తి.
వారసుడి పేరును పేర్కొనమని ప్రధాన న్యాయమూర్తిని కోరిన కేంద్రం
- Advertisement -
- Advertisement -
- Advertisement -