Saturday, April 26, 2025

కమిటీ ఏర్పాటు చేస్తాం… సమ్మె విరమించండి: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసన సాగిస్తున్న వైద్యులు తక్షణం సమ్మె నిలిపివేయాలని కేంద్రం సూచించింది. వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది.

దేశంలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, వంటి వ్యాధులు ప్రబలు తున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది. అత్యవసరం కాని వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్టు భారత వైద్య సంఘం (ఐఎంఎ) ప్రకటించడంతో దేశంలో అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News