- Advertisement -
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ : నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు తెరిచి ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం ఆహార మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు పలు సూచనలు కూడా చేసింది. ఆదివారాల్లో కూడా తెరిచి ఉంచాలని సూచించింది. రేషన్ షాపుల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఎక్కువ రోజులు షాపులు తెరిచి ఉంచడం వల్ల లబ్ధిదారులు రద్దీ తక్కువగా ఉంటుందని, తద్వారా కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలేర్పడుతుందని పేర్కొంది. రాష్ట్రాలకు ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేశామని వెల్లడించింది. రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయని, మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 51 లక్షల డోసులు పంపిణీ చేస్తామని తెలిపింది.
- Advertisement -