Friday, November 15, 2024

తెలంగాణపై కేంద్రం అక్కసు

- Advertisement -
- Advertisement -

ఎపికి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ హుకుం

నెల రోజుల్లోగా రూ.6756 కోట్లు చెల్లించాలని ఆదేశం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై
మౌనం కేంద్రం ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం హస్తిన ఆదేశాలపై విద్యుత్ సంస్థల ఆందోళన

మనతెలంగాణ/ హైదరాబాద్: కేంద్రం మరోసారి తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కింది. విద్యుత్ బకాయిలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపికి చెల్లించాల్సిన బకాయిలను 30 రోజుల్లోగా చె ల్లించాలని తెలంగాణ ప్రభుత్వా న్ని ఆదేశించింది. విభజన తర్వా త 2014- నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ. 3,441 కోట్ల ప్రిన్సిపల్ అమౌం ట్, రూ. 3,315 కోట్ల లేట్ పే మెంట్ సర్ చార్జీలు చెల్లించాలి. దీనికి సంబంధించి తెలంగాణ ప్ర భుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలో ఏపికి బకాయిలు చెల్లించాలని కేంద్రం ఆదేశించడంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులో కేసున్నప్పుడు ఇలాంటి ఆదేశాలు జా రీ చేయడం ఏమిటనీ రాష్ట్ర ప్ర భుత్వం ఆగ్రహం చేసింది. ఈ నె లలో విద్యుత్ ఎక్సేంజీలో తెలంగాణ విద్యుత్ సంస్థలు బకాయి లు లేకున్నా విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం మరోసారి తెలంగాణపై ఉన్న అక్కసును ఈ రూపంలో వెళ్లగక్కింది.

కేంద్రం వద్ద సమస్య పరిష్కరించుకుంటామంటూ ఎపి ప్రభుత్వం…

అయితే విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాలకు సంబంధించి చెల్లింపులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారం కాకపోవడంతో గతంలోనే తెలంగాణ విద్యుత్ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ఏపి ప్రభుత్వం కూడా అసలు, వడ్డీ సహా రూ.6,283.68 కోట్ల బకాయిలు తెలంగాణ నుంచి రావాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన అనంతరం కేంద్రం వద్ద తమ సమస్యను పరిష్కరించుకుంటామంటూ ఇటీవలే తమ పిటీషన్‌ను హైకోర్టు నుంచి ఉపసంహరించుకుంది. అయితే రూ.4,774 కోట్లు ఏపి నుంచి రావాలంటూ తెలంగాణ విద్యుత్ సంస్థలు కోర్టులో పిటిషన్ వేయడంతో పాటు ఏపి జెన్‌కో, ఏపి జెన్‌కో పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టు నుంచి ఈ మొత్తం రావాల్సి ఉందని, వాటిని చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ టిఎస్ జెన్‌కో, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్టు తరఫున టి. రామకిషన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.విచారణ ముగిసేదాకా చర్యలు తీసుకోకుండా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలన్నారు.

ఎపి విద్యుత్ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినందకుమార్ షామిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా, పిటిషనర్ తరపు న్యాయవాది రామారావు వాదనలు వినిపించారు. వాదనలను విన్న ధర్మాసనం ఏపి జెన్‌కో, ఏపి జెన్‌కో పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, ఎపి పవర్ కోఆర్డినేషన్ కమిటీ, ఎపి విద్యుత్ శాఖ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ సమయంలోనే కేంద్రం తాజాగా తెలంగాణకు వ్యతిరేకంగా ఎపికి అనుకూలంగా బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News