Wednesday, January 22, 2025

పార్లమెంటులో చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వచ్చిన ఆరోపణలపై, హిండెన్‌బర్గ్ నివేదికపై ఎలాంటి చర్చ పార్లమెంటులో జరగకుండా ఉండేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ప్రధాని ఆ అంశంపై నుంచి చర్చను తప్పించాలనుకుంటున్నారు. కానీ అదానీ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలి. కారణం ఏమిటన్నది అందరికీ తెలియాలి. వాస్తవాలు వెలికి రావాలి. లక్షలాది, కోట్లాది డబ్బు అవినీతి మయమైపోయింది. అదానీ వెనుక ఏ శక్తి ఉందనేది ప్రజలకు తెలియాలి’ అని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. ‘అదానీ వెనుక ఉండి నడిపిస్తున్నదెవరో తెలియాలి.పార్లమెంటులో చర్చ జరగాలి. దర్యాప్తు జరగాలి. నేను ఇదివరకటి నుంచే ‘హమ్ దో…హమారే దో’ తతంగం జరుగుతోందని తెలిపాను. కానీ ప్రభుత్వమే పట్టించుకోలేదు. అదానీ మీద చర్చ జరపడానికి ప్రభుత్వమే భయపడుతోంది’ అని చెప్పుకొచ్చారు.

మోసం(ఫ్రాడ్), తిమ్మిని బమ్మిచేయడం(మ్యానిపులేషన్)పై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరపాలని విపక్షాలన్నీ కోరుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘పార్లమెంటులో అదానీ సర్కార్…షేమ్ షేమ్’ అని విపక్ష సభ్యులు అరిచినా ఫలితం లేకుండా పోయింది. పైగా స్పీకర్ ఓమ్ బిర్లా ‘వెళ్లండి…వెళ్లి మీ సీట్లలో కూర్చొండి’ అని ఆదేశించారే తప్ప చర్చకు అవకాశం ఇవ్వలేదు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా ఇది?’ అనిపించేలా పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యుల వినతులనే పట్టించుకోని ప్రభుత్వం ఇక ప్రజల గోడు వింటుందా?…ఏది ఎలా ఉన్నా మళ్లీ ఉభయ సభలు నేడు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు అదానీ గ్రూప్ నష్టాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News