Monday, December 23, 2024

‘పవర్’ పాలిటిక్స్

- Advertisement -
- Advertisement -

Centre ban on power purchase to Telangana as name of arrears

బకాయిల పేరిట విద్యుత్ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం

తెలంగాణపై కక్షగట్టిన మోడీ సర్కార్, గురువారం అర్ధరాత్రి నుంచి కొనుగోళ్లు బంద్
నిషేధం ఉన్నా నిరంతర సరఫరా, సోమవారం హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఉచిత విద్యుత్, రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించలేదనే నెపంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఇండియన్ ఎల క్ట్రిసిటీ ఎక్స్చేంజ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకుండా 27 రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఆయా రాష్రాలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి నుంచి ఎక్స్ఛేంజీ ద్వారా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలు విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. బకాయిపడిన రాష్ట్రాల్లో తెలంగాణ (రూ.1380 కో ట్లు), తమిళనాడు (924 కోట్లు), రాజస్థాన్ (500 కోట్లు), జమ్మూ కాశ్మీర్ (434 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (412 కోట్లు), మహారాష్ట్ర (381 కోట్లు), చత్తీస్‌గఢ్ (274 కోట్లు), మధ్యప్రదేశ్ (230 కో ట్లు), ఝార్ఖండ్ (214 కోట్లు), బీహార్‌లు (172 కోట్లు) కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గురువారం అర్థరాత్రి నుంచి విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే వీలుంది. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు దళితులకు గృహా విద్యుత్, నాయిబ్రహ్మణ, రజకులకు జీవనోపాధి నిమిత్తం ఉచిత విద్యుత్ సరఫరాను తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఇబ్బంది పెట్టాలన్న కుట్రతోనే ఈ నిర్ణ యం తీసుకుందని రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఆరోపించారు.
కక్ష సాధిస్తున్న కేంద్రం : సిఎండి
విద్యుత్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని ట్రాన్స్‌కో, జెన్ కో సిఎండి ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజు 5 నుంచి 10 మిలియన్ల యూనిట్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల నిషేధం విధించొద్దని హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంతో పాటు 26 రాష్ట్రాలకు ఎక్స్చేంజ్ లో విద్యుత్ కొనుగోలు నిలిపి వేయాలని ఆదేశించడం సరికాదన్నారు. రాష్ట్రాలపై మరోసారి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పునుకున్నదన్నారు. కేంద్ర నిర్ణయంపై సోమవారం హైకోర్టులో కంటెంప్ట్ వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Centre ban on power purchase to Telangana as name of arrears

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News