Sunday, November 17, 2024

నకిలీ వార్తల వ్యాప్తి.. 8 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం

- Advertisement -
- Advertisement -

Centre bans 8 YouTube channels for spreading fake news

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 8 యూ ట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది. ఇందులో ఏడు భారత్‌కు చెందినవి కాగా, ఒకటి పాకిస్థాన్‌కు చెందినదిగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఛానళ్లకు మొత్తం 85 లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వీటిలో వచ్చిన వీడియోలను 114 కోట్ల మందికి పైగా వీక్షించారు. దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు , దేశంలో కొన్ని వర్గాల మధ్య ద్వేషం పెంచేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు ఈ ఛానెళ్లను బ్లాక్ చేసినట్టు సమాచార , ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. భారత సాయుధ బలగాలు, జమ్ముకశ్మీర్‌కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు నకిలీ వార్తలను ప్రసారం చేశాయని పేర్కొంది. తాజా నిర్ణయంతో గత ఏడాది నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 102 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది. ఆన్‌లైన్‌లో సామాజికమైన, విశ్వసనీయమైన , సురక్షిత వార్తల ప్రసారం ఉండేలా చూసుకోవడం తమ బాధ్యత అని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని బలహీన పర్చేలా సామాజిక మాధ్యమాలు ప్రయత్నిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News