Sunday, November 17, 2024

‘ సేవలపై ఆర్డినెన్స్’ రాజ్యాంగ విరుద్ధం, ఢిల్లీ ప్రభుత్వాధికారాన్ని లాక్కునే యత్నం!

- Advertisement -
- Advertisement -

కేంద్రంను విమర్శించిన ‘ఆప్’మంత్రి ఆతిషీ

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ‘సేవలపై ఆర్డినెన్స్’ను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి ఆతిషీ దుయ్యబట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికారాలను ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ(బిజెపి) జీర్ణించుకోలేకపోతోందని ఆమె అన్నారు. ఢిల్లీలో పెత్తం చెలాయించడానికే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని ఆమె అన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాన్ని కట్టబెట్టేందుకే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని ఆమె అన్నా. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ‘న్యూ నేషనల్ కేపిటల్ సర్వీసెస్ అథారిటీ’ని ఏర్పాటుచేస్తారు. దీనికి చైర్‌పర్సన్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటారు. ప్రధాన కార్యదర్శి, ముఖ్య హోమ్ కార్యదర్శి కమిటీలో సభ్యుడిగా ఉంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News