- Advertisement -
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను నియంత్రించలేకపోతోందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కట్టడి చేయలేకే ట్విట్టర్ ను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తనను కూడా ఎదుర్కోలేకపోతోందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తనను ఎదుర్కోలేకే తమ ప్రభుత్వాన్ని అణచివేసే ప్రయత్నం చేసిందని ఆమె తెలిపారు. కేంద్రం ఇకనైనా నియంతృత్వ ధోరణి ఆపాలి దీదీ సూచించారు. బెంగాల్ లో ఎక్కడా రాజకీయ హింస లేదని సిఎం మమత స్పష్టం చేశారు. రాజకీయ హింసను తాము ఖండిస్తున్నామని చెప్పారు. రాజకీయ హింస అనేది బిజెపి జిమ్మిక్కేనని ఆమె ఆరోపించారు. నదిలో మృతదేహాలు తేలుతున్న యుపిపై కేంద్రం దృష్టిపెట్టాలన్నారు. యస్ తుపాను తర్వాత ఇప్పటికీ కేంద్ర ఆర్థిక సాయం లేదని ఆమె పేర్కొన్నారు.
- Advertisement -