Monday, December 23, 2024

‘పేరు’ పోరు

- Advertisement -
- Advertisement -

దేశ తొలి ప్రధాని నెహ్రూ మ్యూజియం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం
మోడీ సర్కార్ వెకిలి చేష్ట : కాంగ్రెస్ ధ్వజం

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని నెహ్రూ మో మొరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ (ఎన్‌ఎంఎంఎల్)పేరును కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. దీనికి కొత్తగా ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజి యం అండ్ లైబ్రరీ సొసైటీగా పేరు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఈ చర్యపై కాంగ్రెస్ పార్టీ తీవ్రం గా నిరసన వ్యక్తం చేసింది. ఇది చిల్లరవేషం, కక్షసాధింపు ధోరణి అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం స్పందించారు. వారసత్వ ఘనతలు ఈ విధంగా బిల్డింగ్‌ల పేర్లు తారుమారు చేయడంతో చెదిరిపోవని ఖర్గే తెలిపారు. తీన్‌మూర్తి భవన్ ఆవరణలో ప్రధాన మంత్రి సం గ్రహాలయను ఆవిష్కరించిన ఏడాది తరువాత ఇప్పుడు నెహ్రూ పేరిట ఉన్న మ్యూజియంకు కొత్త నామకరణం చేశారు. ఎన్‌ఎంఎంఎల్ ప్ర త్యేక సమావేశంలో ఈ లైబ్రరీ పేరు మార్పు నిర్ణ యం తీసుకున్నారని సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పు డు జరిగిన పేరు మార్పిడి వల్ల అధికారంలో ఉన్న వారి అల్పబుద్ధి, నిరంకుశ తత్వం మరోమారు వెలుగులోకి వచ్చిందని ఖర్గే విమర్శించారు. బిజెపి సంకుచిత వైఖరి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) పెత్తనం ఈ చర్యతో తేటతె ల్లం అయిందని స్పందించారు.

ఈ చర్యతో పం డిట్ నెహ్రూ ప్రతిష్టకు వచ్చే నష్టం ఏదీ ఉండదని, అయితే పరువు పొయ్యేది ఈ చర్యకు పాల్పడిన వారిదే అవుతుందన్నారు. ఈ పేరు మార్పిడితో వారు ఈ దేశ ప్రజలకు నెహ్రూ అందించిన అపారసేవలను తగ్గించలేరని, ఆధునిక భారత నిర్మా త నెహ్రూ అని, చరిత్రలోని సత్యం ఈ విధమైన దుందుడుకు వైఖరితో మరుగునపడిపోదని ఖర్గే తెలిపారు. ఏ విధంగానూ ఎటువంటి చరిత్ర లేని వారు ఈ విధంగా ఇతరుల ఘన చరిత్రలను చెరిపివేస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఆధునిక భారతదేశ నిర్మాత, ప్రజాస్వామ్యానికి పరిరక్షకుడని నెహ్రూను ఖర్గే కొనియాడారు. 59 ఏండ్లుగా నెహ్రూ స్మారక సంస్థ వెలుగొందుతూ వచ్చిందని, ప్రపంచవ్యాప్త మేధోశక్తికి ఓ మైలురాయిగా నిలిచిందని, అపార అరుదైన గ్రంధాలు ఉన్న ఈ స్థలానికి పేరు మార్పు మోడీ అనే పేరు తగిలించుకున్న చిల్లర వ్యవహారాల వ్యక్తి తలపెట్టిన చర్య అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ వ్యవహారాల ఇన్‌ఛార్జి జైరాం రమేష్ మండిపడ్డారు. మనీష్ తివారీ, శశిథరూర్ ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఈ పేరు మార్పిడిపై తమ నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News