Friday, January 3, 2025

సోషల్ మీడియాపై కుట్ర: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (క్రమబద్ధీకరణ) బిల్లు తీసుకురావడం ద్వారా డిజిటల్ మీడియా. సోషల్ మీడియా, ఒటిటి వేదికలు, వ్యక్తిగత హోదాలో రాసే, మాట్లాడేవారి ‘గొంతు నొక్కేందుకు’ మోడీ ప్రభుత్వం సిద్ధం అవుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఆరోపించారు. అటువంటి చర్యలను దేశం సహించబోదని ఆమె స్పష్టం చేశారు.

భావ ప్రకటన స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యం గురించి మహాత్మా గాంధీ(యంగ్ ఇండియా 1922), జవహర్‌లాల్ నెహ్రూ (1940 మార్చి) వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రియాంక ‘ఎక్స్’ పోస్ట్‌లో పంచుకున్నారు. ‘భావప్రకటన స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛను మన పౌరులు పొందలేదనేందుకు అవి రెండు ఉదాహరణలు. వాటి కోసం లక్షలాది మంది ప్రజలు ఏళ్ల తరబడి పోరాడారు’ అని ప్రియాంక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వమూ పౌరుల స్వేచ్ఛను అణచివేయాలని ఎన్నడూ ఆలోచించదని ప్రియాంక అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News