Monday, April 14, 2025

అంబేడ్కర్ ను భారతరత్నతో గౌరవించిన ఘనత బిజెపిదే: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబేడ్కర్ విగ్రహాలను రేపటి జయంతోత్సవాలకు సిద్ధం చేస్తున్నామని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో అంబేడ్కర్ విగ్రహాన్నికిషన్ రెడ్డి శుభ్రం చేశారు. ఆయన మీడియాతోమాట్లాడుతూ..అంబేద్కర్ జయంతిని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని అన్నారు. రేపు నాంపల్లిలోని బిజెపి ఆఫీసు నుంచి ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపు జరుగుతుందని చెప్పారు. అంబేడ్కర్ భారతరత్నతో గౌరవించిన ఘనత బిజెపిదేనని తెలియజేశారు. అంబేడ్కర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. లండన్ లో అంబేడ్కర్ చదువుకున్న ఇంటిని మోదీ మ్యూజియంగా మార్చారని, తదుపరి ఢిల్లీలోని రాజ్యాంగం రచించిన ఇంటిని యాత్రాస్థలంగా తీర్చిదిద్దామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News