Saturday, January 11, 2025

బడ్జెట్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

బంగారం కొనేవారికి శుభవార్త
గోల్డ్, సిల్వర్‌పై కస్టమ్ డ్యూటీ 10% నుంచి 6 శాతానికి
తగ్గింపు ఏకంగా తగ్గిన బంగారం ధర
బంగారం, వెండి కొనాలనుకునే వారి బడ్జెట్‌లో తీపి కబురు విని పించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో బం గారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 4 శాతం తగ్గించారు. అంటే బం గారం, వెండిపై ప్రస్తుతం ఉన్న ప్రాథమిక కస్టమ్ డ్యూటీని 10 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అలాగే ప్లాటినంపై కస్టమ్ డ్యూటీ ని 6.4 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రకటన తర్వాత బం గారం ధర రూ.4000 తగ్గింది. వెండి ధర రూ. 3,000 పైగా తగ్గింది. ప్ర కటన తర్వాత ఎంసిఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.2036 తగ్గి రూ.70,682కి చేరుకుంది. అదే సమయంలో కిలో వెండి ఈ కాలంలో రూ. 3,000 తగ్గి రూ. 86,000 స్థాయికి చేరుకుంది.

రూ.4వేలు తగ్గిన బంగారం ధర
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్) ధర రూ.4వేలు తగ్గి రూ.70,860కి పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ.4వేలు తగ్గి రూ.71,010కు చేరుకుం ది. అయితే శనివారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 75,550 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలపడుతున్న ట్రెండ్, స్థాని క నగల వ్యాపారుల నుంచి డిమాండ్ కారణంగా గత వారం బంగారం ధరలు పెరిగాయి. జూలై 18 నుంచి గత నాలుగు సెషన్లలో వెండి కిలోకు రూ.3,400 తగ్గింది. జూలై 18న కిలో రూ.400 తగ్గి రూ.94,000 వద్ద ముగి సింది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ బంగారం మరోసారి ఔన్స్ 2400 డాలర్లకి చేరుకుంది. స్పాట్ బంగారం ఔన్స్‌కి 2,394 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఒక ఔన్స్ 2,395 డాలర్ల వద్ద ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News