Tuesday, November 5, 2024

ఒమిక్రాన్ భయంతో మళ్లీ కేంద్రం ఆంక్షల పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Centre extends covid 19 Restrictions till Dec 31

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అప్రమత్తమైన కేంద్రం ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలను డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈమేరకు దేశం లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యంత అప్రమత్తతతో ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని సూచించారు.

అలాగే వారు ఎవరెవర్ని కలిశారో ట్రేసింగ్ చేసి, వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు. మరోవైపు కొత్త వేరియంట్ల కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ తక్షణమే ప్రజారోగ్య చర్యల్ని చేపట్టాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్ కట్టడి చర్యల్ని డిసెంబర్ 31వరకు కొనసాగించాలని, ఆయా రాష్ట్రాలను ఆదేశించారు. ఒమిక్రాన్ కలకలం నేపధ్యంలో మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని సూచించారు.

Centre extends covid 19 Restrictions till Dec 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News