లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్, సుప్రీంలో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు, ఆర్డినెన్స్ సుప్రీం తీర్పును ధిక్కరించడమే, కోర్టును ఆశ్రయిస్తాం: కేజ్రీవాల్, సమర్థించుకున్న బిజెపి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న పోరాటం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కొలిక్కి వచ్చేట్లుగా కనిపించడం లేదు. ఢిల్లీలో ప్ర భుత్వాధికారుల నియంత్రణ విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐఎఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే ని యంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు.
సేవల విభాగం కార్యదర్శి ఆశిష్ మోరెను బదిలీ చేశారు. అయితే కేంద్రం దీనికి అడ్డుతగిలింది. అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ శుక్రవారం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆ వెంటనే ఇటీవల ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసింది. మరో వైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్ ద్వారా అ డ్డుకునేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి ఆర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు ఈ నెల 18నుంచి ఆరు వారాలు సెలవులున్నట్లు తెలుసుకొని ఒక రోజు తర్వాత ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందని విమర్శించా రు. ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, అన్రజాస్వామికం అని మండిపడ్డారు.
దీనిపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. అంతేకాదు ప్రజల్లోకి వెళ్లి కేంద్రం కుట్రను ప్రజలకు వివరిస్తామని, దీనికి వ్యతిరేకంగా మహా ర్యాలీని నిర్వహిస్తామని కూడా కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ఆప్ మం త్రి ఆతిషి, ఎంపి సంజయ్ సింగ్ కూడా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పైన తీవ్రస్థ్థాయిలో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు అధికారాలు లభిస్తే ఆయన ఢిల్లీని అసాధారణ రీతిలో అభివృద్ధి చేస్తారని వారు (కేంద్రం) భయపడుతున్నారని, అందుకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చారని వారు దుయ్యబట్టారు.ఇది అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కూడా వారన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆట ముగిశాక రూల్స్ మార్చడమేమిటని ఢిల్లీ ప్రభు త్వం తరఫున సుప్రీంలో వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పే ర్కొన్నారు.
అంతేకాకుండా ఈ ఆర్డినెన్స్ ఇంకా పా ర్లమెంటులో ఆమోదం పొందలేదనే విషయాన్ని ఆ యన గుర్తు చేశారు. అయితే కేంద్రం తీసుకువచ్చి న ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నే ఉందని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భా టియా శనివారం అన్నారు. పార్లమెంటు ఏ విషయంపైనా ఎగ్జిక్యూటివ్ అధికారాలు మంజూరు చేస్తూ చట్టం తీసుకు వస్తే దానికి అనుగుణంగా లె ఫ్టెనెంట్ గవర్నర్ అధికారాలను కూడా మార్చవచ్చ ని సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించిన విషయాన్ని భాటియా గుర్తుచేశారు. ఢిల్లీ కేజ్రీవాల్ భూ భాగం కాదని, అది రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే నడుస్తుంది తప్ప కేజ్రీవాల్ ఇష్టప్రకారం కాదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.