Wednesday, January 22, 2025

నీట్‌పై కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ పరీక్షలలో చెదురుమదురు అక్రమాల ఘటనల ప్రభావం లక్షలాది మంది విద్యార్థులపై పడరాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కొన్ని నిర్ణీత ప్రాం తాల్లోనే తప్పిదాలు లేదా అక్రమాలు జరిగి ఉంటాయని, వీటిని ప్రాతిపదికగా చేసుకుని మొత్తం పరీక్షకు ఎసరు పెట్టడం భా వ్యం కాదని, కుదరదని గురువారం ఆయన ఇక్కడ తెలిపారు. పరోక్షంగా ఆయన పరీక్ష మొత్తం రద్దును తోసిపుచ్చారు. నీట్ ప రీక్షలలో అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని ప్ర తిపక్షాలు, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు తలెత్తుతు న్న దశలో విద్యామంత్రి స్పందించారు. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి నిజాయితీతో పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు.

అక్కడక్కడ జరిగిన తప్పిదాలకు అత్యధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులకు చేటు కల్గించడం భావ్యమా అని ప్రశ్నించారు. కేంద్ర విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రధాన్ నీట్ వ్యవహారంపై ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి స్పందించడం ఇదే తొలిసారి. పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్‌టిఎ పనితీరుపై ఉన్నత స్థాయి కమిటీ ఆరా తీస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు గురించి త్వరలోనే ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు సమీక్ష, నిర్వహణ మెరుగుదలకు ఈ కమిటీ రంగంలోకి దిగుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థుల పరీక్షల నిర్వహణ , దీనిపై వాదోపవాదాల అంశం అత్యంత సున్నితమైన విషయం, ప్రతిపక్షం ఇంతవరకూ చేసింది చాలుకానీ , ఇకనైనా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని, ఇది తన అభ్యర్థన అని మంత్రి తెలిపారు. తప్పిదాలు జరిగినట్లు తేలితే ఇందుకు బాధ్యులు ఎవరైనా వదిలేది లేదని, చివరికి ఎన్‌టిఎను కూడా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. యుజిసి నెట్ పరీక్ష రద్దు గురించి ప్రస్తావించిన మంత్రి పరీక్షా పత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయిందని ,దీనిని గుర్తించి ఈ చర్య తీసుకున్నారని తెలిపారు. మన వ్యవస్థల గురించి మనకు నమ్మకం ఉండాలి. ఏమైనా లోటుపాట్లు అక్రమాలు జరిగితే ప్రభుత్వం సహించబోదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News