Wednesday, January 15, 2025

బిజెపి గ్యాస్ ఛాంబర్లే తరువాయి

- Advertisement -
- Advertisement -

Centre Gas Chambers Like Hitler Says Shiv Sena

సామ్నా సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు

ముంబై : కేంద్రంలోని బిజెపి రకరకాల వేధింపులకు పరాకాష్టగా మారిందని, ఇక జనాన్ని హింసించేందుకు గ్యాస్ ఛాంబర్ల ఏర్పాటు తరువాయిగా పరిస్థితి ఉందని శివసేన తీవ్రంగా ఆరోపించింది. గురువారం పార్టీ అధికార పత్రిక సామ్నా తమ సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసింది. రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువ అయ్యాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని గంటల తరబడి ఇడి వర్గాలు విచారించడం , కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి పోలీసులు యత్నించడం వంటి అంశాలను సామ్నా ప్రస్తావించింది. కేంద్ర వైఖరిని ప్రశ్నించింది. ఈ ప్రభుత్వ వైఖరి చివరికి ఎవరి కాలర్ పట్టుకుని అయినా గుంజేలాగా మారిందని వ్యాఖ్యానించింది. నెహ్రూ , ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను చరిత్రలో నుంచి చెరిపేవేసేందుకు యత్నిస్తున్నారు.

చివరికి నెహ్రూ గాంధీ కుటుంబ వారసత్వ ప్రాభవం కన్పించకుండా చేయాలని సంకల్పించిందని సామ్నా సంపాదకీయంలో తెలిపారు. రాహుల్‌గాంధీని ప్రశ్నించడం ద్వారా బిజెపి తాము ఎవరినైనా నిలదీయవచ్చుననే విషయాన్ని బాజాప్తాగా తెలియచేసుకుంటున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు రాహుల్ తరువాత సోనియా ఆ తరువాత ఎవరినైనా నిలదీయడమే బిజెపి తంతుగా మారిందని పేర్కొన్నారు. చివరికి బిజెపి పాలన ఇప్పుడు హిట్లర్ పోకడలను సంతరించుకుంది. ప్రత్యర్థులను దెబ్బతీయడం, వారిని రాజకీయంగా వేధించడం తంతుగా మారిందని సామ్నా తెలిపింది. ఇక చివరికి మిగిలింది కేవలం హిట్లర్ నిర్మించిన మాదిరిగా ప్రతిపక్షాలను హింసించేందుకు విషపూరిత గ్యాస్ ఛాంబర్లు ఏర్పాటు చేయడమే తరువాతి ఘట్టంగా మిగిలిందని వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News