Wednesday, March 26, 2025

రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై నిర్ణయానికి కేంద్రానికి 4 వారాల గడువు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం పై నిర్ణయం తీసుకోడానికి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు నాలుగు వారాలు అంటే ఏప్రిల్ 21 వరకూ గడువు ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు. 2004 నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు. ఆయన పౌరసత్వం పై చాలా ఏళ్లుగా ప్రశ్న తలెత్తుతూనే ఉంది. ప్రస్తుతకేసు కర్ణాటకకు చెందిన శిశిర్ అనే ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఉంది. ఈ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.రాహుల్ గాంధీ పౌరసత్వ స్థితిపై తనకు కొత్త సమాచారం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాహుల్ గాంధీ పేరు తమ పౌరసత్వ రికార్డులలో ఉందని బ్రిటీష్ ప్రభుత్వం నుంచి తమకు ప్రత్యక్ష సమాచారం ఉందని, తన వాదనకు మద్దతుగా తనవద్ద రహస్య ఈ- మెయిల్స్ కూడా ఉన్నాయని శశిర్ కోర్టుకు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న భారతీయ చట్టాల ప్రకారం ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేదని, ఏ పౌరు డైనా మరో దేశం పౌరసత్వం తీసుకుంటే, మనదేశం పౌరసత్వం కోల్పోతారని, అందుకు సంబంధించిన అన్నిడాక్యుమెంట్లు తాను కోర్టుకు సమర్పించినట్లు పిటిషనర్ తెలిపారు. ఈ కేసు గత ఏడాది నవంబర్ లో జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లా తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చినప్పుడు హోం మంత్రిత్వశాఖ తరుపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బి పాండే హాజరయ్యారు. ఈ పిటిషన్ పై తీసుకున్న చర్యలపై వివరణ దాఖలు చేయాలని కోర్టు కోరింది. ఇప్పటివరకూ వివరణ దాఖలు కాలేదు. హోం మంత్రిత్వశాఖ స్పందనకు మూడు వారాల గడువు ఇచ్చారు. గత నెల ఢిల్లీహైకోర్టులో ఇదే విధమైన కేసువిచారణకు వచ్చింది. 2019లో బీజేపీ మాజీ ఎంపీ సుభ్రమణ్యస్వామి ఈ కేసుదాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.

రాహుల్ గాంధీ భారతీయుడు కాదని వచ్చిన ఏచర్చనైనా కాంగ్రెస్ తోసిపుచ్చుతూ వచ్చింది.రాహుల్ గాంధీ భారతీయుడే, ఇక్కడే పుట్టి పెరిగాడు అని ఆయన సోదరి ప్రియాంకగాంధీ వద్రా ప్రకటించారు. కాగా, రాహుల్ గాంధీ తన పేరు ప్రతిష్టతను దెబ్బతీసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News