- Advertisement -
న్యూఢిల్లీ: అకాల్ తఖ్త్ జతేదార్ జ్ఞానీ హర్‌ప్రీత్ సింగ్‌కు జెడ్ క్యాటగిరీ భద్రతను కేంద్ర హోం శాఖ సమకూర్చినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు సమాచారం అందడంతో దేశంలోనే రెండవ అత్యున్నత క్యాటగిరి అయిన జెడ్ భద్రతను అకాలీ తఖ్త్ జతేదార్‌కు అందచేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఆయనకు సిఆర్‌పిఎఫ్ కమాండోల భద్రత లభిస్తుందని అధికారలు తెలిపారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జతేదార్‌తోసహా 400 మందికి భద్రతను ఉపసంహరించింది. ఆ తర్వాత ఆయనకు భద్రతను పునరుద్ధరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ భద్రతను తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. కాగా..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిఆర్‌పిఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తారు.
- Advertisement -