Wednesday, April 9, 2025

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ఆరు నెలల్లోనే రెండు
ఎయిర్‌పోర్టులకు అనుమతి
రోడ్లు, భవనాలశాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మన తెలంగాణ /హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దం అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పో ర్టుకు అనుమతులు సాధించిన సంగతి తె లిసిందే. అనతికాలంలోనే అదనంగా ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్ట్ మంజూరుకావ డం గమనార్హం. ఈ విషయాన్ని రోడ్లు భ వనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రె డ్డి అధికారికంగా వెల్లడిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రత్యకంగా శుభాకాంక్ష లు తెలియజేశారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకారం తెలిపినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలో ఏయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్దతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కృషితో మామునూర్, నేడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అనుమతుల మంజూరులో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడులకు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఆరు నెలల స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని మంత్రి కోమటిరెడ్డి అభివర్ణించారు.

మున్ముందు వాయుసేన శిక్షణ కేంద్రం
ఆదిలాబాద్ జిల్లాలో భవిష్యత్తులో వాయిసేన శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు భారత వాయుసేన నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన లేఖలో పేర్కొన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన చేసిన అభ్యర్థనకు భారత వాయుసేన అధికారులు సముఖతవ్యక్తం చేయడంతో పాటు అక్కడే భవిష్యత్తులో వాయుసేన శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు లేఖలో తెలిపారని మంత్రి వెల్లడించారు. పౌర విమాన సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వాయుసేన అధికారులు లేఖ ద్వారా తెలిపినట్లు ఆయన వివరించారు.

జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమానయానానికి, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేయాలని వాయుసేన తన లేఖలో సూచించింది. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడం, పౌర టర్మినల్ ఏర్పాటు, విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి మరియు ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం(ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్) వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమకూర్చుకోవాలని ఆ లేఖలో సూచించినట్టు మంత్రి వివరించారు.

త్వరలో ప్రపోజల్స్
ఎయిర్ పోర్ట్ కు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిటెయిల్ ప్రపోజల్స్ ను భారత వాయుసేనకు సమర్పించాలని కోరారు. అందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణను అధికారులతో సమీక్షిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అతిత్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రానికి, సంబంధిత విభాగాలకు సమర్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News