Saturday, November 23, 2024

కొవిడ్‌పై సమీక్షించి నిబంధనలు సడలించండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

- Advertisement -
- Advertisement -

Centre Govt letter to States on corona restrictions

న్యూఢిల్లీ: కొవిడ్ కేసుల ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించి అదనపు ఆంక్షలను సడలించడానికి ప్రయత్నించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బుధవారం లేఖల ద్వారా సూచించారు. కేసులసంఖ్య అధికంగా ఉంటే ఆంక్షలను కొనసాగించవచ్చని, లేనిపక్షంలో సడలించాలని సూచించారు. జనవరి 21 నుంచి దేశంలో క్రమంగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, గతవారం రోజువారీ సరాసరిన 50,476 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో తాజాగా కొత్త కేసులు 27,409 వరకు నమోదయ్యాయని పేర్కొన్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందన్నారు. ఈ ఏడాది మొదట్లో కేసుల వ్యాప్తి ముమ్మరంగా ఉండడంతో కొన్ని రాష్ట్రాలు తమ సరిహద్దుల్లోను, విమానాశ్రయాల వద్ద అదననపు ఆంక్షలు విధించాయని చెప్పారు.

కొవిడ్‌తో ఏర్పడిన ప్రజారోగ్య సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోగలగడమే కాకుండా, అదే సమయంలో అదనపు ఆంక్షలతో ప్రజల రాకపోకలకు, ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడవలసిన అవసరం ఉందని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారికి విధించిన ఆంక్షలను ఫిబ్రవరి 10న కేంద్ర ప్రభుత్వం సవరించిందని గుర్తు చేశారు. ప్రతిరోజు కరోనా కేసుల పైన, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలు నిర్వహించడమే కాకుండా, టెస్టులు, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

Centre Govt letter to States on corona restrictions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News