- Advertisement -
హైదరాబాద్: పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తెలంగాణకు 409 కోట్ల రూపాయల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది. పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని సూచన చేసింది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెలంగాణకు 682 కోట్లు విడుదల చేసింది. నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమైన పదిరోజుల్లోపు వాటిని పంచాయతీ ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. పది రోజులు దాటితే వడ్డీతో సహా నిధులు బదిలీ చేయాలన్న కేంద్రం పేర్కొంది.
Centre Govt released Funds to Panchayats
- Advertisement -