Monday, November 25, 2024

కేంద్రానికి మనో వైకల్యం

- Advertisement -
- Advertisement -

పని కన్నా ప్రతిష్ఠ కోసం మోడీ సర్కార్ పాకులాట
కొవిడ్ కట్టడి, టీకా పాలసీ అయోమయం: ఆర్థికవేత్త అమర్తసేన్
ముంబై: భారతదేశంలో ఇప్పటి గడ్డు పరిస్థితికి అయోమయం, గందరగోళపు కేంద్ర ప్రభుత్వమే కారణమని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్తాసేన్ స్పష్టం చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, టీకాల పరిస్థితి, లాక్‌డౌన్లు, ప్రజల దుస్థితి నేపథ్యంలో సేన్ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అసలే ప్రభుత్వం గందరగోళంగా ఉంది. పైగా ఎప్పటికప్పుడు తమ చేతలకు ప్రతిష్ట దక్కించుకోవాలనే తపనతోనే ఉంది. ఈ క్రమంలో కొవిడ్ 19 నియంత్రణ వ్యాప్తిని అరికట్టడంలో చతికిలపడింది. ఫలితంగా స్కిజోఫెర్నియా వంటి మానసిక దుర్బలవస్థతో ప్రజలు మిక్కిలి కష్టాలకు గురయ్యారని సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది తక్కువ చూపేది చెప్పేది ఎక్కువ కావడం ఫలితంగానే దేశంలో వైరస్ అడ్డూ అదుపూ లేకుండా విస్తరించుకుంది. దీని ఫలితాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తోందన్నారు. ప్రజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ చుట్టుపక్కల వాతావరణంతో మానసిక శూన్యస్థితి ఆవరించుకోరాదు. అయితే ఇదే స్థితి క్రమేపీ ప్రజలో అలుముకోవడం వల్ల ఈ విపత్కర స్థితి నెలకొంటోందని సేన్ వాపొయ్యారు. నిజానికి భారతదేశానికి ఉన్న సమర్థ ఔషధ ఉత్పత్తి శక్తి, తరాల నుంచి ఉంటూ వస్తోన్న తరగని రోగనిరోధక పటిమ వంటివాటితో ఇటువంటి కొవిడ్‌లను సునాయాసంగానే ఎదుర్కొని ఉండాల్సింది. అయితే ఎందుకీ విధంగా జరిగిందనేది పలు కీలక విషయాలను తెలియచేస్తుందన్నారు. శుక్రవారం రాత్రి ఆయన ముంబైలో రాష్ట్ర సేవాదళ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడారు.
పని కన్నా ప్రతిష్టకు పాకులాటనే ఎక్కువ
ప్రస్తుత సెకండ్‌వేవ్ దేశంలో తీవ్రస్థాయి ప్రభావం చూపుతున్న అంశాన్ని సేన్ ప్రస్తావించారు. నిజానికి దేశానికి ఉన్న సొంతవనరులతోనే ఈ మహమ్మారిని తగువిధంగా తట్టుకుకోవచ్చు. అయితే ప్రభుత్వ వర్గాలలో నెలకొని ఉన్న అయోమయం సంక్షోభం పట్ల శీతకన్నుగా మారిందన్నారు. వైరస్‌ను అంతం చేసేశామని ముందుగానే చేతులు దులిపేసుకున్నందునే చాపకింద నీరులాగా కొవిడ్ విస్తరించుకుని కీడు కల్గించిందనే విషయాన్ని పలువురు నిపుణులు చెపుతున్నారని సేన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో ఓ దశలో కరోనా రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటడం, రోజువారి మరణాలు 5వేల వరకూ చేరుకోవడం వంటి పరిణామాలే సంక్లిష్టతను అధికారిక లెక్కల ప్రకారమే చాటుతున్నాయని అన్నారు. గందరగోళం, తక్కువ చేసి ఎక్కువగా పేరు పొందాలనుకునే తత్వంతో కొవిడ్ మూలాలు మరింతగా విస్తరించుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం తాను కరోనాను నియంత్రించినట్లు గొప్పలు చెప్పడానికి సమయం వెచ్చించింది. ఇదే దశలో వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయితో చిక్కులు ఏర్పడ్డాయని తెలిపారు. దీనిని ఓ విధంగా స్కిజోఫెర్నియాగా పేర్కొనవచ్చు అన్నారు.

Centre Govt’s Schizophrenia led to Covid ravages: Amartya sen

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News