Sunday, December 29, 2024

కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డిఎ పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సండుగల సీజన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కరవుభత్యాన్ని(డిఎ) 4 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ పెంపుదల 2023 జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. తాజాగా పెంచిన 4 శాతంతో కలిపి ప్రస్తుతం డిఎ రేటు 46 శాతానికి చేరుకుంది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ఈనిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News