Sunday, January 19, 2025

రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

- Advertisement -
- Advertisement -

Centre Hikes All Rabi Crops MSP

రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు
కందిపప్పు, గోధుమ, ఆవాలతో సహా ఆరుపంటల ఎంఎస్‌పి పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: సీజన్‌లో ప్రధాన పంటలైన గోధుమ, ఆవాలతోపాటు శనగ, బార్లీ, కుసుమ పంటల కనీస మద్దతుధరలను కేంద్రం పెంచింది. గోధుమలు, ఆవాలతో సహా ఆరు పంటల కనీస మద్దతు ధర పెంచుతూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ గోధుమలకు రూ.110 పెంచడంతో రూ.2,215కి మద్దతు ధర లభించనుంది. అదేవిధంగా ఆవాలపై రూ.400 పెంచడంతో ఎంఎస్‌పి లభించనుంది. ఈ ఏడాది పెంచడంతోపాటు రైతులకు ఆదాయం పెరిగే విధంగా కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కమిటీ ఆన్ అఫైర్స్ రబీ పంటల కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి కొత్తగా కేంద్రం నిర్ణయించిన ఎంఎస్‌పిలకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని అధికారులు తెలిపారు. ఖరీఫ్, రబీ రెండు 23 రకాల పంటలకు ఎంఎస్‌పిలను కేంద్రం భారీగాపెంచింది. కాగా పంట సీజన్ అక్టోబర్ నుంచి ప్రారంభంకానుంది. అనంతరం పంటలు ఆరంభమవుతాయి. దేశవ్యాప్తంగా రైతులు ప్రధానంగా గోధుమ, ఆవాల పంటలకు ప్రాధ్యాన్యమిస్తారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2022-23 వ్యవసాయం సంవత్సరం (జులై-జూన్), 2023-24 మార్కెటింగ్ సీజన్ రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. కందిపప్పుపై అత్యధికంగా కనీస మద్దతు ధర రూ.500 పెంచగా ఆవాలు క్వింటాల్‌కు రూ.400 ఎంఎస్‌పి పెరిగింది. కాగా క్వింటాల్ గోధుమలకు కనీస మద్దతు ధర ఉండగా రూ.110 పెంచడంతో ఎంఎస్‌పి లభించనుంది. క్వింటాల్ గోధుమల ఉత్పత్తి వ్యయం రూ.1065గా అంచనా వేశారు.

క్వింటాల్ బార్లీకి రూ.100 పెంచడంతో రూ.1,635 నుంచి రూ.1735 ఎంఎస్‌పి లభించనుంది. ఈ సందర్భంగా సమాచార ప్రసారశాఖ మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ.. గోధుమ, ఆవాల పంటలపై 100శాతం ఆదాయం పొందేందుకు ప్రభుత్వం హమీఇస్తూ ఎంఎస్‌పి భారీగా పెంచిందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపారు. కందిపప్పుపై రూ.500 పెంచడంతో క్వింటాల్ మసూర్ పప్పుకు రూ.5,500 నుంచి రూ.6000 ఎంఎస్‌పి లభించనుంది. నూనెగింజల ఎంఎస్‌పి పెంపుతో క్వింటాల్ ఆవాలుకు రూ.5050 నుంచి రూ.5,450కు కనీస మద్దతు ధర పెరిగింది. కుసుమ పంట మద్దతు ధర రూ.209 పెంచడంతో క్వింటాల్ ధర.5,441 నుంచి రూ.5,650కి పెరిగింది. పపులు, నూనెగింజల ఉత్పత్తిపై కేంద్ర ప్రధానం దృష్టి సారించింది. దీంతో 2014-15లో 27.51మిలియన్ టన్నులున్న నూనెగింజల ఉత్పత్తి 2021-22 నాటికి టన్నులకు పెరిగిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News