Friday, November 22, 2024

కోలార్ బంగారంపై కేంద్రం కన్ను

- Advertisement -
- Advertisement -

కోలార్ బంగారంపై కేంద్రం కన్ను
ఆరునెలల్లో 2.1 బిలియన్‌డాలర్ల నిక్షేపాలకు టెండర్లు?
న్యూఢిల్లీ: కర్నాటకలోని విస్తారిత కోలార్ బంగారు గనుల నుంచి 50 మిలియన్ టన్నుల బంగారం వెలికితీతకు భారత ప్రభుత్వం సంకల్పించింది. దీని విలువ రమారమి 2.1 బిలియన్ డాలర్లు వరకూ ఉంటుంది. బంగారు గనుల నుంచి ఈ ఖనిజం వెలికితీతకు పెద్ద ఎత్తున బిడ్స్‌ను ఆహ్వానించాలని సంబంధిత వ్యవహారాల పరిజ్ఞానం ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు గురువారం తెలిపారు. కర్నాటకలో వలస కాలపు కోలార్ బంగారు గనులు ఇప్పటికీ విశేష రీతిలో ముడి బంగారంతో అలరారుతున్నాయి. బెంగళూరుకు 65 కిలోమీటర్ల ఈశాన్యంలో ఉన్న కోలార్ బంగారు గనులు దేశంలోని అతి పురాతన బంగారు గనులుగా పేరొందాయి. ఈ గనులలో తవ్వకాలను 20 ఏళ్ల క్రితం నిలిపివేశారు. ఇందులో దాదాపు 2.1 బిలియన్ డాలర్లు విలువ చేసే నిల్వలు ఉండి ఉంటాయని ఓ అంచనా మేరకు స్పష్టం అయింది.

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పనిముట్ల సాయంతో, సరైన దిశలో బంగారం నిక్షిప్తాలను కనుగొనేందుకు వీలేర్పడింది. ఈ క్రమంలో ఇంతకు ముందు తీసిన బంగారం నిల్వల వెలికితీత క్రమంలో మిగిలిన శేషభాగం కూడా వెలుగులోకి వస్తుంది. బంగారంతో పాటు పాల్లాడియంను కూడా శుద్ధిచేసే ఖనిజం నుంచి సేకరించాలని సంకల్పించారు. బంగారం నిక్షేపాల వెలికితీతకు వచ్చే ఆరు నెలల్లో బిడ్స్‌ను పిలుస్తారని, ఇప్పుడు సంబంధిత విధివిధానాలు ఖరారు అవుతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఈ విషయం తెలిపారు.

ఇప్పటివరకూ విదేశీ కంపెనీలకే బంగారం వెలికితీసే టెక్నాలజీ సంబంధిత పరిజ్ఞానం ఉంది. ముడి బంగారాన్ని పసికట్టడం, దీనిని బంగారంగా స్వచ్ఛంగా రూపొందించడం వంటి పలు క్లిష్టతలు ఉంటాయి. సాధారణంగా విదేశీ కంపెనీలు స్థానిక కంపెనీలతో లేదా పలు కంపెనీల సముదాయాలతో కలిసి ఈ బంగారం వెలికితీతల కాంట్రాక్టు దక్కించుకుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News