న్యూఢిల్లీ: ఎయిర్‌బస్‌తో శుక్రవారం కేంద్రం చేసుకున్న ఒప్పందంతో భారత వాయుసేన రెండేళ్లలో తొలి సి-295ఎండబ్లు రవాణా విమానాలను పొందనున్నది. మొత్తం 56 విమానాల ఒప్పందంలో తొలివిడతగా 16 విమానాలు ఎగిరే కండిషన్‌లో స్పెయిన్ నుండి అందనున్నాయి. కాగా మిగతా 40 విమానాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్, ఎయిర్‌బస్ ఇండియా తయారుచేయనున్నాయి. ఇదిలా ఉండగా చివరి విమానం 10 ఏళ్ల తర్వాత వాయుసేనకు అందనుంది. కాగా భారత్‌లో ఈ విమానాల తయారీ నాలుగైదేళ్లలో మొదలు కానుంది. స్పెయిన్, భారత్‌ల మధ్య కుదిరిన ఒప్పందం రూ. 20000కోట్లని అంచనా. అయితే అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడంలేదు.
ట్రాన్స్‌పోర్ట్ కాన్ఫిగరేషన్, స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌తో ఈ విమానాలను అందించనున్నారు. “భారత వాయుసేన విమానాల ఆధునీకరణలో ఇదో ముందడుగు” అని ప్రభుత్వం తెలిపింది.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండి, సిఇఒ సుకరన్ సింగ్ ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ విమానాల ఉతత్తికిగాను 100కుపైగా సైట్లను పరిశీలించనున్నామని తెలిపారు. అయితే స్థానికలతో సహా అన్ని పక్షాలవారితో సంప్రదించాకే సైట్ విషయంలో నిర్ణయానికి రాగలమాన్నారు. కాగా ఎయిర్‌బస్ దక్షిణాసియా అధ్యక్షుడు, ఎండి రేమీ మిల్లార్డ్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కేవలం సాంకేతిక బదిలీయేకాక ఇంకా చాలా అభిలాషలున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు భారత్‌ను ప్రపంచ తయారీ పటంలో ఉంచగలదన్నారు.
ఎయిర్‌బస్‌తో కేంద్రం రూ. 20వేల కోట్ల ఒప్పందం
- Advertisement -
- Advertisement -
- Advertisement -