Sunday, December 22, 2024

యాపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యాపిల్ ఫోన్లను వినియోగించే వారికి కేంద్రం భద్రతా పరమైన హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఐఫోన ఐపాడ్, యాపిల్ వాచ్, మాక్‌బుక్, ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు సపారీ బ్రౌజర్‌లో సెక్యూరీట లోపం ఉన్నట్టు గుర్తించామని ఈ సంస్థ తెలిపింది.

భారత్‌లో ఉత్పత్తి 5 రెట్లు పెంపు
ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ భారత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నాలుగు ఐదు సంవత్సరాల్లో ఐదు రెట్లకు అంటే 40 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.32 లక్షల కోట్లు) ఉత్పత్తిని పెంచాలని కంపెనీ యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ 7 బిలియన్ డాలర్ల ఉత్పత్తి మార్క్‌ను దాటింది.

ఐఫోన్-15 అద్భుత స్పందన
యాపిల్ ఐఫోన్-15 సిరీస్ సేల్ ప్రారంభమైన వెంటనే అద్భుతమైన స్పందన వస్తోంది. సెప్టెంబరు 22న సేల్‌లో మొదటి రోజు ఐఫోన్-14తో పోలిస్తే కొత్త ఐఫోన్-15 విక్రయాలు రెట్టింపు అయ్యాయి. నివేదిక ప్రకారం, మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్-15, ఐఫోన్ 15 ప్లస్‌లకు మొదటి రోజు సేల్‌లో భారీ డిమాండ్ కనిపించింది. భారతదేశంలో ఢిల్లీ, ముంబైలోని యాపిల్ అధికారిక షాప్‌లు రెండూ ఉదయం 8 గంటలకు తెరిచారు. సాధారణంగా 11 గంటలకు తెరుస్తారు. కొత్త యాపిల్ డివైజ్‌లను కొనుగోలు చేసేందుకు రెండు స్టోర్‌ల బయట పెద్ద సంఖ్యలో కస్టమర్‌లు కనిపించారు. డెలివరీ అయిన మొదటి రోజు నుంచే మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్‌లు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News