- Advertisement -
న్యూఢిల్లీ: పేద ఖైదీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెనాల్టీ లేదా బెయిల్ అమౌంట్ భరించలేని కారణంగా జైళ్లలో కొనసాగుతున్న పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
”ఈ పథకం పేద ఖైదీలకు ఎంతో ఉపయోగపడుతుంది. సామాజికంగా వెనుకబడిన లేదా తక్కువ విద్య, ఆదాయ స్థాయి కలిగిన అట్టడుగు వర్గాలకు చెందినవారు, జైలు నుండి బయటకు రావడానికి ఇది వీలు కల్పిస్తుంది” అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
- Advertisement -